Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorizedప్రతీ పెట్రోల్ బంకులను తనిఖీ చేయండి

ప్రతీ పెట్రోల్ బంకులను తనిఖీ చేయండి

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


జనగామ ప్రతినిధి,తెటగు లీడ్స్: పెట్రోల్ డీజిల్ సరఫరాపై అధికారులు నిరంతరం పర్యవేక్షించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని జనగామ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ సందీప్ కూమర్ ఝా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పెట్రోలియం సంస్థల ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులతో ఎనర్జీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్, పోలీస్,లీగల్ మెట్రాలాజి అధికారులు నిరంతరం ప్రతీ బంకుని తనిఖీ చేసి ఇందన నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లాలో  పెట్రోలు,డీజిల్ కృతిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకోవాలని, బంకుల్లో క్యూలో ఉన్న వాహనదారులకు పెట్రోల్,డీజిల్ పోయాలని బాటిల్,కాన్లలో పోయకూడదని,ఆలా పోయడం వల్ల నిల్వ చేసే అవకాశం ఉందని,తద్వారా కృత్రిమ కొరత ఏర్పడుతుందన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ బెన్ షాలోం, ఆర్డివోలు గోపీరామ్,వెంకన్న,జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, లీగల్ మెట్రాలాజి అధికారి ఝాన్సీ, సివిల్ సప్లై డిఎం హతీరామ్, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు తది తరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES

Most Popular

Recent Comments