Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి

📰 Generate e-Paper Clip

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

వరంగల్ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: పోలీస్ చెక్ పోస్టుల్లో సిబ్బంది తప్పని సరిగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. గోవులతో పాటు మూగ జీవాల అక్రమ రవాణా నియంత్రించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దుల్లో ప్రత్యేకంగా పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ చెక్ పోస్టుల్లో సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు కమిషనర్ శుక్రవారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కటాక్షపూర్ చెక్‌పోస్ట్‌ను అకస్మికంగా తనిఖీ చేపట్టారు. డ్యూటీలో ఉన్న సిబ్బందిలో సంగం తనిఖీలో మరో సగం విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని చెప్పారు. ప్రతి ఒక్క వాహనాన్ని, కంటైనర్లను సైతం తనిఖీ చేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని అయన హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ వెంట ఆత్మకూర్ ఇన్స్‌స్పెక్టర్ సంతోష్ కుమార్ తదితరులు వున్నారు.

RELATED ARTICLES

Most Popular