Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedతల్లిని చంపిన కొడుకు

తల్లిని చంపిన కొడుకు

📰 Generate e-Paper Clip

మృతదేహంపై 16 కత్తిపోట్లు

10 రోజుల తరువాత వెలుగులోకి

విజయనగరం,లీడ్స్ న్యూస్: బుద్ధిగా చదువుకోవాలని మందలించిన తల్లిని పదహారేళ్ల బాలుడు తన తల్లిని కత్తితో అతి దారుణంగా పొడిచి చంపి పరారైన ఘటన ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజాం గ్రామంలో ఉంటున్న ముంజేటి సతీష్,స్పందన దంపతుల కుమారుడు ఈ నెల 4న ఈ దారుణానికి ఒడిగట్టాడు. పాఠశాలలో ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడని,దీంతో తల్లి మందలించి బుద్ధిగా చదువుకోవాలని చెప్పింది. ఫలితంగా కక్ష పెంచుకున్న కుమారుడు తనకు చదువు అవసరం లేదని మాఫియా డాన్ అవుతానని, తన స్నేహితుడిని ఇంటికి పిలిచి,అతని సహాయంతో 16 సార్లు కత్తితో అతి దారుణంగా తల్లిని పొడిచి హత్య చేసి, చనిపోయిందని ధ్రువీకరించుకుని,శవాన్ని చీరలో చుట్టి పక్కనే ఉన్న కోనేరులో పడేసి పరారయ్యారు. వెళ్లే ముందు ఇంటినుండి 5 వేల నగదు,9 తులాల బంగారు నగలతో పారిపోయారు. ఆ తరువాత ముంబై, విశాఖపట్నం వెళ్లి జల్సాలు చేసి పలాసకు రాగ అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తే ‘డాన్ ‘ అవ్వాలని సమాధానం చెప్పినట్టు తేలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular