Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorizedప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం

ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం

📰 Generate e-Paper Clip

జనగామ,లీడ్స్ న్యూస్: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం రఘునాథపల్లి మండల కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను సిపిఐ పార్టీ నాయకులు దగ్ధం చేసి నిరసన తెలిపారు. మండల కార్యదర్శి కావటి యాదగిరి నేతృత్వంలో కేంద్రం పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. యాదగిరితో పటు పలువురు మాట్లాడుతు ప్రధాని మోదీ మొన్న జరిగిన ఐదు రాష్ట్రా ఎన్నికల్లో పెట్రోల్,డీజిల్,గృహ అవసరాల గ్యాస్ ధరలను పెంచబొమని చెప్పి,ఎన్నికలు అయిపోగానే పెట్రోల్,డీజిల్ ధరలు పెంచారని వారు అన్నారు. మోడీ హైదరాబాద్ వచ్చి రాష్ట్ర ప్రజలకు గ్యాస్ వాడకం తగ్గించండి,పెట్రోల్,డీజిల్ వాడకం తగ్గించండి,బంగారం కొనుగోలు చేయ్యో ద్దని చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని వారన్నారు. ఈ నిరసనలో గొంగళ్ళ మహేందర్,భాషపాక ఏలియా, సుద్దాల శ్రీకాంత్,కావటి కీర్తిక,ఆటో యూనియన్ నాయకులు అడ్డూరి శ్రీనివాస్, తాళ్లపళ్లి మహేందర్,బైరపాక నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments