Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorizedజనగామ కలెక్టర్ పై ఫిర్యాదుల పరంపర

జనగామ కలెక్టర్ పై ఫిర్యాదుల పరంపర

📰 Generate e-Paper Clip

జనగామ,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. బాధ్యతలు చేపట్టిన ఆనతి కాలంలోనే పలు వివాదాలకు అయన కేంద్ర బిందువు అయ్యారు. వనిత టీ స్టాల్ మొదలుకొని, కలెక్టరేట్లోకి ప్రజల వాహనాలను అనుమతించకపోవడం వరకు నిత్యం ఆయనపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం సాయంత్రం జనగామకు చెందిన పలువురు కలెక్టర్ బాధిత పరిరక్షణ కమిటీ పేరుతో ప్రముఖ న్యాయవాది సాదిక్ అలీ నేతృత్వంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి కలెక్టర్ ఫై ఫిర్యాదు చేశారు. గత గురువారం రాత్రి ఇదే కమిటీ సభ్యులు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి కలెక్టర్ పై ఫిర్యాదు చేశారు. జిల్లా పాలనాధికారిగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండాల్సిన కలెక్టర్ ప్రజల పాలిట శాపంగా మారాడని ఈ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. కింద స్థాయి అధికారులు సమస్యగా మారితే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాము, అలాంటిది కలెక్టరే ప్రజల పాలిట ప్రజా ప్రతినిధుల పాలిట సమస్యగా మారితే తాము ఎవరికీ చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు జనగామ ఎమ్మెల్యే పల్లా తో పాటుగా కడియం శ్రీహరికి,తాజాగా ఎంపీని కలిసి ఫిర్యాదు చేశారు.
ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి, ఇసుకమొరం కరువు అవుతుందని,రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిబంధనల పేరుతో కలెక్టర్ అడ్డుకుంటున్నాడని వారు పల్లా దృష్టికి తీసుకు వెళ్లారు. గ్రామాల్లో స్థానికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని షరతులతో మట్టి,ఇసుకకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ గోదావరి ఇసుకను వాడలేరని,అతి ఖరీదైన గోదావరి ఇసుక సామాన్యుడు కొని ఇండ్లు కట్టుకోలేడని వాపోయారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకకు కూపన్ లు ఇస్తున్నారు. మట్టి సంగతి ఏంటని, ఇందిరమ్మ ఇల్లు రాకకుండా ఉండి ఇండ్లు,బాత్రూములు, ఇళ్ల మరమ్మతులు చేపట్టే వారికి ఇసుకమట్టి ఎలా రావాలని? వారు ప్రశ్నిస్తున్నారు. తమ పట్టా భూముల్లో నుండి వాగులు పారుతున్నప్పటికీ ఆ ఇసుకను స్వంత అవసరాలకు వాడుకోలేని పరిస్థితి నెలకొందని వారు ఆ ఫిర్యాదులో తెలిపారు. అంతే కాదు,కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లే వారిని, వారి వెంట వచ్చిన సహాయకులను అడ్డుకోవడం,వారి వాహనాలను,అలాగే వాహనాలను కలెక్టరేట్ ప్రాంగణంలోని పార్కింగ్ లోకి వెళ్లకుండా అడ్డుకోవడం వల్ల దివ్యాంగులు,వృద్ధులు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్ బయట రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పార్కు చేసి వెళ్తే పోలీసులు చలానాలు బాదుతునారని, ఇలా చేయడం సమంజసమా? అని వారు ప్రశ్నించారు.తమ సమస్యలకు పరిష్కారం చూపాలని వచ్చే ప్రజలను,ప్రజా సమస్యలను వెలికి తీసే పాత్రికేయుల వాహనాలను కలెక్టరేట్లోకి అనుమతించకుండా మొండిగా ఉండడం ఏంటని పలువురు అంటున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగినేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుల దృష్టికి తీసుకువెళ్ళి కలెక్టర్ ను భదిలి చేసి ప్రజలకు ఊరట కలిగించాలని కోరారు. వారిలో కలెక్టర్ భాదిత పరిరక్షణ కమిటీ కన్వీనర్ సాదీక్ అలీ,కో కన్వీనర్ బోట్ల శేఖర్ కన్నారపు పరుశరాములు, బానోతు ధర్మభిక్షం, ఎనగందుల ఉమాపతి, కమిటీ సభ్యులు బూడిది,గోపి జోగు ప్రకాష్,మడికంటి వెంకటేష్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments