Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorized'మీడియా'పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

‘మీడియా’పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సోషల్ మీడియా పూర్తిగా విఫలమయిందని అన్నారు. ఎమ్మెల్యేలు తమ సొంత భజనకే సోషల్ మీడియాను వాడుతున్నారని ఫైర్ అయ్యారు.ఎమ్మెల్యేలు కూర్చున్నా, నిల్చున్నా టెంకాయ కొట్టినా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారే తప్ప పార్టీ పటిష్టతపై దృష్టి సారించడం లేదన్నారు.
ప్రభుత్వ,పార్టీ కార్యక్రమాలను ఎమ్మెల్యేలు, సోషల్ మీడియాలో కనీసం పార్టీ గురించి ప్రచారం చేయట్లేదని, రాహుల్‌ గాంధీ, టీపీసీసీ,సీఎం సందేశాలను సోషల్‌ మీడియా, పార్టీ కార్యకర్తలు పట్టించుకోవట్లేదని, పార్టీ,ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కసిగా పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, సోషల్ మీడియా ఇంచార్జ్ లు ఇప్పుడు అలా చేయట్లేదని అన్నారు. పార్టీ సోషల్‌ మీడియాను వినియోగించుకోవడం అనేది ఎమ్మెల్యేలంతా నేర్చుకోవాలని అయన హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments