Friday, June 26, 2026
No menu items!
HomeUncategorizedవ్యవసాయం,విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యం

వ్యవసాయం,విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యం

📰 Generate e-Paper Clip

దేవాదుల ప్రాజెక్టుతో సాగులో అభివృద్ధి

ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ దృష్టి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క

జనగామ ప్రతినిధి, లీడ్స్ న్యూస్: వ్యవసాయ,విద్యుత్తు అవసరాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక, విద్యుత్ శాఖ మాత్యులు మల్లు బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని పలు నూతన సబ్ స్టేషన్ లకు శంకుస్థాపనలు చేశారు. అలాగే మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ విద్యుత్ సబ్ స్టేషన్ల కోసం రూ.60.62 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా  చిల్పూర్ మాండలం పల్లగుట్టలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని, ఇందులో భాగంగా  రుణమాఫీ,ధాన్యం కొనుగోలు చేయడం చేపడుతున్నట్లు చెప్పారు. దేవాదుల ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందని అయన అన్నారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఘనపూర్ ప్రాంత అభివృద్ధికి ఈ విద్యుత్ సబ్ స్టేషన్లు ఎంతో కీలకమన్నారు. ఒకప్పుడు వలసలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం దేవాదుల ప్రాజెక్టు,ఉచిత విద్యుత్ వల్ల వ్యవసాయం లో అభివృద్ధిని సాధించిందని తెలిపారు. రైతుల ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రఘునాథపల్లి 132 కేవీ సబ్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని,లైన్ షిఫ్టింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని,ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కూడా కేటాయించాలని అయన బట్టి విక్రమార్కను ఆయన కోరారు. అంతకు ముందుగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రైతులు, ప్రజలకు నిరంతర విద్యుత్తును అందించేందుకు ఈ సబ్ స్టేషన్లు దోదం చేస్తాయన్నారు. ఇందిరా రైతు సేవా కేంద్రాల మహిళలకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మరింత స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ రూ. 60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన సబ్ స్టేషన్ల వల్ల ఘనపూర్ నియోజకవర్గంలో లోడ్ మేనేజ్‌మెంట్ మెరుగుపడటంతో పాటు విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి,కె.ఆర్ నాగరాజు,యశస్విని రెడ్డి,నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు,పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి,పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు కోళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments