Thursday, August 27, 2026
No menu items!
HomeUncategorizedకన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: మండలంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. రఘునాథపల్లి మండల కేంద్రంలోని దొడ్డి గుట్ట వద్ద ఉన్న అయోధ్య రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణంలో గ్రామ సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్,ఉప సర్పంచ్ దావరి యాకయ్య సిద్ధమ్మ, పంచాయతీ కార్యదర్శి బాలకిషన్ దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా బాంజిపేట గ్రామంలో చెరుకు రమేష్ పద్మారాణి దంపతులు స్థానిక సీతారాముల దేవాలయంలో కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ గొరిగె రవి, గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్,గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular