Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedకెసిఆర్ క్షమాపణలు చెబితే రాజీనామా చేస్తా

కెసిఆర్ క్షమాపణలు చెబితే రాజీనామా చేస్తా

📰 Generate e-Paper Clip

కడియం శ్రీహరి

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): పార్టీ ఫిరాయిప్పుల విషయంలో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రజలకు క్షమాపణ చెబితే తాను వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో నిలబడి పోటీ చేస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయన మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెపితే,తాను రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే ధైర్యం కేసిఆర్ ఉందా? అని ప్రశ్నించారు ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే తన రాజీనామ గూర్చి మాట్లాడే అర్హత లేదని కడియం స్పష్టం చేశారు. 2014 నుండి 23 వరకు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వివిధ పార్టీల నుండి 36 మంది ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లో చేర్చుకొని అందులో ఇద్దరికీ మంత్రి పదవులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కేటీఆర్ సుద్దపూస ముచ్చట్లు మాట్లాడుతున్నాడని, నెలకు రూ.5,000 చొప్పున తమ గౌరవ వేతనం నుండి ప్రతినెల బిఆర్ఎస్ పార్టీ కట్ చేసుకుంటుందని, అలాంటప్పుడు తాము ఏ పార్టీలో కొనసాగుతున్నావో చెప్పాలని పరోక్షంగా సవాల్ విసిరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments