Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedక్షేమంగా ఇంటికి రండి..

క్షేమంగా ఇంటికి రండి..

📰 Generate e-Paper Clip

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో సిపి  సన్ ప్రీత్ సింగ్

వరంగల్ ప్రతినిధి,లీడ్స్ న్యూస్ : వాహనాలపై ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ నిబందనలు పాటిస్తూ క్షేమంగా ఇంటి రావాలని.. మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 18వ తేదీ వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా సోమవారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కమిషనర్ ముఖ్య అతిధి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. సిపి మాట్లాడుతూ  వాహనదారులు వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మద్యం సేవించి వాహనం నడపటం,సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ప్రయాణించడం ప్రమాదకరమని, ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. యువత అతివేగంగా వాహనాలను నడిపి మృత్యువాత పడవద్దని. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని అన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది తల్లిదండ్రుల కన్నీళ్ళకు కారణమవుతున్నాయని అన్నారు. అనంతం చింతల్ పల్లి గ్రామంలో తప్పని సరిగా హెల్మెట్ ధరించి రావలని లేదంటే గ్రామంలో ప్రవేశం లేదని గ్రామ సభలో తీర్మానం చేసారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీలు చేసారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత, కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సిఐ పులి రమేష్,కాజీపేట్, హసన్‌పర్తి ఇన్స్‌స్పెక్టర్లు సుధాకర్ రెడ్డి,చేరాలు,ఎల్కతుర్తి, ముల్కనూర్ ఎస్.ఐలు ప్రవీణ్ కుమార్, రాజు,గ్రామ సర్పంచ్ రజిత రవీందర్,మార్కెట్ చైర్మన్ సంతాజీతో ఇతర పోలీస్ అధికారులు, గ్రామస్తులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments