
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్,(లీడ్స్ న్యూస్): కమిషనరేట్ పరిధిలో గంజాయి,అక్రమ ఇసుక గుట్కా రవాణా ,పేకాట వంటి వాటిని ఎన్ ఫోర్స్ మెంట్ సహకారంతో కట్టడి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారుల ఆదేశించారు. మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాలో కమిషనరేట్ క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తోలుత పెండింగ్ కేసుల వివరాలు,వాటి స్టేటస్, పరిష్కారం,వారెంట్లు,సిబ్బంది పనితీరుపై సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని, చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లను తెరవాలని,అధికంగా చోరీలు జరిగే ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని,పేకాట రాయుళ్లపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్ లు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయాలని,గంజాయి వినియోగదారున్ని పట్టుకోవడమే కాకుండా విక్రయించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన ఆరైవ్ – ఆలైవ్ కార్యక్రమంపై అవగహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు ప్రణాళికలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్,కవిత,ఏ.ఎస్పీ పండరి చేతన్, ట్రైనీ ఐపిఎస్ మనీషా నెహ్ర, అదనపు డిసిపిలు ప్రభాకర్ ,రవి, బాలస్వామి, శ్రీనివాస్ తో పాటు ఏసిపిలు,సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్లు, అర్.ఐలు ఎస్.ఐలు పాల్గోన్నారు.
