హాజరైన ప్రభుత్వ విప్పు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో బీరప్ప-కామరాతి కల్యాణం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ బీరప్ప కళ్యాణం జరిగిన ఐలయ్య హాజరవుతున్నారు. కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప స్వామి కల్యాణ వేడుకల్లో భాగంగా ఆదివారం మొదటిరోజు మైలపోలు,గంగ స్నానానికి లింగాల తరలింపులో భాగంగా ఆదివారం రఘు బోనం సమర్పించి,స్వామివారి మైలపోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బీర్ల విన్యాసాలు, డోలు వాయిద్యాల నడుమ లింగాలను గంగమ్మ చెంతకు తీసుకెళ్లారు. గంగ స్నానం అనంతరం తిరిగి కల్యాణ వేదికకు చేరుకున్న బీర్లవారికి మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కురుమ కుల పెద్దమనుషులు కర్రె రాములు కురుమ,పూజారి గోరిగె యాదగిరి కురుమ,మాజీ సర్పంచ్,జోగు గట్టయ్య కురుమ,మాజీ ఎంపీటీసీ గొరిగె భాస్కర్,కమిటీ కోశాధికారి సానికె ఉమేందర్ సభ్యులు కొలుపుల వెంకన్న,భూష కుమార్,సానిక చంద్రయ్య, రేగు భాస్కర్,కౌడ వినోద్,మంగ సోమయ్య,గొర్రె సోమయ్య,కర్రే యాదయ్య, కోడూరు గ్రామ పెద్దలు,ప్రజాప్రతినిధులు,కురుమ సంఘం నాయకులు,యువకులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కళ్యాణానికి జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్,పలువురు ప్రజా ప్రతినిధులు,వివిధ గ్రామాలకు చెందిన కురుమ బంధువులు పెద్ద విత్తన హాజరయ్యారు. మంగళవారం ఒగ్గు కళాకారులతో బీరప్ప – కామరాతి ఒగ్గు కథ ప్రదర్శన ఉంటుంది. బుధవారం చల్ల పంచడంతో ఈ పండుగ ముగుస్తుంది.

