Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedడ్రగ్స్ కు దూరంగా ఉండండి

డ్రగ్స్ కు దూరంగా ఉండండి

📰 Generate e-Paper Clip

ఈగల్ ఫోర్స్ డిఎస్పి శివన్నాయుడు

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ప్రతి ఒక్కరు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని అప్పుడే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఈగల్ ఫోర్స్ డిఎస్పి శివ నాయుడు, రఘునాథపల్లి సిఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చైల్డ్ సేఫ్టీ,యాంటీ డ్రగ్ పై అవగాహన కల్పిస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రఘునాథపల్లి,ఖిలాషాపూర్, కోమళ్ళ,కంచనపల్లి తదితర గ్రామాల్లో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  డ్రగ్స్ కు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని యువతకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పారు. ఈ కార్యక్రమాల్లో రఘునాథపల్లి ఎస్సై దూదిమెట్ల నరేష్,పాఠశాల విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments