Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedతొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష

తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష

📰 Generate e-Paper Clip

మధురై కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: తమిళనాడు రాష్ట్రంలోని సత్తాంకులంలో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మదురై కోర్టు సోమవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సెల్ఫోన్ దుకాణం నడుపుకునే జయరాజ్ (58) బెనిక్స్ (31)  ఇద్దరినీ 2020 జూన్ 19న సత్తాంకులంలో  కరోనా నిబంధనలు ఉల్లంఘించారని తండ్రి కొడుకులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేయగా తండ్రి కొడుకులు ఇద్దరు గంటల వ్యవధిలోనే పోలీస్ కస్టడీలో మరణించారు. వారి ఒంటిపై ఉన్న రక్తపు మరకలు గాయాల కారణంగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు, స్వచ్ఛంద సంఘాల ప్రెషర్ మేరకు మొత్తం పదిమంది పోలీసులపై అప్పట్లో కేసు నమోదయింది. అందులో ఒకరు మరణించగా తొమ్మిది మందిపై తండ్రి కొడుకులది కస్టోడియల్ మరణంగా భావించి ఉరిశిక్ష విధిస్తూ మధురై కోర్టు కోర్టు తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ కేసు విధుల పేరుతో అత్యుత్సాహం చూపే పోలీసులకు కనువిప్పు కానుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments