రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి దొంగలు పడి బీభత్సం సృష్టించారు. బాంజీపేట,శివాజీ నగర్,కురుమగూడెం, రఘునాథపల్లి గ్రామాల్లో పగలు,రాత్రి అని తేడా లేకుండా చోరీలకు పాల్పడ్డారు. బాంజీపేట గ్రామంలో పగిడిపల్లి సత్తన్న అనే వృద్ధురాలు ఇంటికి తాళం వేసి హైదరాబాదులో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్ళింది. తలుపులు తెరిచి ఉండడంతో స్థానికులు గమనించి వారికి సమాచారం అందించారు. ఇంటికి వచ్చి పరిశీలించగా ఇంట్లో ఉన్న విలుయిన రూ. 10 వేల నగదు,వెండి నగలు, 2.5 గ్రాముల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. శివాజీనగర్ లో కుమార్ అనే వ్యక్తి ఇంట్లో కూడా వెండి నగలు,రూ.10 వేలు, కురుమగూడెం గ్రామంలో ఒక ఇంట్లో రూ. 5 వేలు,రఘునాథపల్లిలోని కొమ్మారెడ్డి రెడ్డి సుధాకర్ రెడ్డి ఇంట్లో విలువైన ల్యాప్టాప్, సెల్ ఫోన్ పట్టపగలే దొంగలు ఎత్తుకెళ్లారు. పక్షం రోజుల క్రితం కూడా రఘునాథపల్లి కురుమ గూడెం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తరచూ గ్రామాల్లో దొంగతనాలు జరుగుతుండడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కోరుతున్నారు. స్థానిక సీఐ ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి,స్థానిక ఎస్ఐ దూదిమెట్ల నరేష్ దొంగతనాలు జరిగిన ఇళ్లను సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

