Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedదొడ్డిగుట్ట రాములోరి కళ్యాణానికి ఏర్పాట్లు

దొడ్డిగుట్ట రాములోరి కళ్యాణానికి ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి,(లీడ్స్ న్యూస్): దొడ్డుగుట్ట వద్ద ఉన్న శ్రీ అయోధ్య రామాలయంలో ప్రతి యేటా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మంగళవారం రఘునాథపల్లి గ్రామ సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్ దంపతుల చేతుల మీదుగా ఆలయ ధర్మకర్తలు పాశం నిరంజన్,దయాకర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు సీతారాముల కళ్యాణ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. దొడ్డి గుట్ట వద్ద ఇప్పటికే చెత్తా చెదారాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించి శుభ్రపరిచారు. గ్రామ పెద్దలు సైతం ఈ కళ్యాణాన్ని విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సర్పంచ్ ఉమారాణి రాజీవ్ లు స్పష్టం చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని వీక్షించి తరించాలని వారు కోరారు.

RELATED ARTICLES

Most Popular