Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

📰 Generate e-Paper Clip

జీసీడివో గౌసియా బేగం

తరిగొప్పుల, లీడ్స్ న్యూస్:
మండలం కేంద్రంలోని పిఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను జీసీడివో గౌసియా బేగం గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను మరుగుదొడ్లు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నీటి సౌకర్యాలను పరిశీలించి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వంటపాత్రలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాలెపు విజయ, ఉపాధ్యాయులు గాదె జోసఫ్ బేబీ,యూసఫ్ పాషా,అమర్నాథ్, పద్మ కవిత,శ్రీనివాస్, రవి, శ్రీనివాస్ పిఆర్పి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments