Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorizedపొన్నూరు సమీపంలో కాల్పులు

పొన్నూరు సమీపంలో కాల్పులు

📰 Generate e-Paper Clip

గుంటూరు,లీడ్స్ న్యూస్:

ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేటు సమీపంలో కట్టర్లు పట్టుకుని రైల్వే ట్రాక్‌ వెంబడి తిరుగుతున్న అపరిచిత వ్యక్తులపై జిఆర్పిఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఈ ఉదయం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులను గమనించిన దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పది రౌండ్లు కాల్పులు జరిపారు. రైల్వేసిగ్నల్‌ వ్యవస్థను ట్యాంపరింగ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు భావించి అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో దుండగులు పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని పొన్నూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments