Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorizedప్రజాసేవలో టిడిపికి 44 ఏళ్ళు

ప్రజాసేవలో టిడిపికి 44 ఏళ్ళు

📰 Generate e-Paper Clip

జెండా ఆవిష్కరిస్తున్న దృశ్యం

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్:
తెలుగుదేశం పార్టీ 44 ఏళ్లుగా ప్రజాసేవలో ఉండడం సంతోషంగా ఉందని ఆ పార్టీ రఘునాథపల్లి మండల అధ్యక్షుడు బొక్క రామచంద్రయ్య అన్నారు. ఆదివారం టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్ల మల్లేశం,ఎండి జహంగీర్ హాజరు కాగా ఆయన మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు యుగపురుషుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి వచ్చాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు ఉమ్మగొని నరసయ్య, కొంగరి నర్సింగరావు గండికోట యాదగిరి, మాస శివశంకర్,తూడి ఉమేష్ శాతర్ల రవి,ఎండి. సికందర్ కాదనూరి మధుసూదన్, పన్నాల శ్రీనివాస్, పిన్నింటి మల్లారెడ్డి,పన్నాల వెంకటరమణ, జేరిపోతుల రవీందర్,మచ్చ మధు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments