Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedప్రతి పంచాయతీలో సీసీ కెమెరాలుండాలి

ప్రతి పంచాయతీలో సీసీ కెమెరాలుండాలి

📰 Generate e-Paper Clip

వీడియో వాల్స్ సైతం తప్పనిసరి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోంలతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం సీసీ కెమెరా వ్యవస్థ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సీసీ వాల్స్ కి అవసరమైన ప్రాంతాలను గుర్తించి మంచి కెమెరాలను ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి టెండర్ ను పూర్తి చేసి ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా సాంకేతిక ప్రమాణాలను పాటించాలని,విద్యుత్ అంతరాయం వచ్చినా రికార్డింగ్ కొనసాగేందుకు అవసరమైన బ్యాకప్ సదుపాయాలను కల్పించాలని సూచించారు. కెమెరాల ద్వారా వచ్చే దృశ్యాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు అవసరమైన చోట వీడియో వాల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీడియో వాల్స్ ద్వారా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు,ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు,ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాలపై నిరంతర సీసీ కెమెరాల నిఘా,బ్యాక్ అప్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో డీఏఓ అంబికా సోనీ,మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్,ఈడీఎం గౌతమ్ రెడ్డి,పోలీసు అధికారులు,ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular