Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorizedప్రమాద స్థలానికి డిసిపి

ప్రమాద స్థలానికి డిసిపి

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ ఈ సాయంత్రం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి ఆయన భాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నుండి కర్ణాటకలోని వివాహ రెసెప్సన్ కు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు భాదితు కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు వారు భావిస్తున్నారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిసిపి వెల్లడించారు. ఆయన వెంట స్థానిక ఎస్సై నరేష్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments