హైదరాబాద్ (లీడ్స్ న్యూస్): మన దేశంలో మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6.47 వరకు ముగిసింది. అంటే మొత్తం 3. 27గంటల పాటు గ్రహణం కొనసాగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సాయంత్రం 6.20 నుండి 6.47 వరకు గ్రహణాన్ని వీక్షించారు. ఇక మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం కారణంగాతెలుగు రాష్ట్రాల్లో పలు దేవాలయాలు మూతపడ్డాయి. తిరిగి సంప్రోక్షణ తర్వాత శ్రీశైలం, తిరుపతి దేవాదాయాలు తెరిచి భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు చంద్రగ్రహణం ప్రభావం ప్రజలపై ఏమి ఉండదని, అదంతా అపోహ మాత్రమేనని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించడం గమనార్హం.

