Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedమొక్కలన్ని పెంట పాలు

మొక్కలన్ని పెంట పాలు

📰 Generate e-Paper Clip

దృష్టి సారించని అధికారులు

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం జాఫర గూడెం గ్రామపంచాయతీ సమీపంలోని బిఎంఆర్ రైస్ మిల్ పక్కన నర్సరీ నుండి నాటేందుకు తీసుకొచ్చిన మొక్కలు వృధాగా పడేశారు. అసలే జిల్లాలో అడవులు ఒక్క శాతానికి మించడం లేదు. మొక్కలు నాటి వృక్ష సంపదను పెంపొందించాలని ప్రభుత్వం నర్సరీల నుండి మొక్కలను ఉచితంగా సప్లై చేస్తుండగా అధికారులు,ప్రజా ప్రతినిధులు వాటిని తీసుకువచ్చి సుమారు 100 మొక్కల వరకు వృధాగా పడేసి పెంట పాలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి భాద్యులను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు మొక్కలను సద్వినియోగపరచుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular