Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedరూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్

📰 Generate e-Paper Clip

ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు

మూలధన వ్యయం రూ.47,267 కోట్లు
వ్యవసాయం,విద్యా,వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన సర్కారు.

హైదరాబాద్,లీడ్స్ న్యూస్
తెలంగాణలో 2026 -27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను రూ. 324,234 కోట్లతో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభ ప్రారంభం కాగా, వాస్తవాలకు దగ్గరగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా,రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు బట్టి చెప్పారు. గొప్పల కోసం మేము ఎప్పుడూ అబద్ధాలు చెప్పబోమని,తమ ప్రభుత్వం వ్యవసాయం,విద్యా,వైద్య రంగాల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని చెప్పారు. కేంద్ర వృద్ధిరేటు 8 శాతం ఉంటే రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతం ఉండన్నారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర వృద్ధి రేటు 2.2 శాతం పెరిగిందన్నారు. శాఖల వారిగా కేటాయించిన బడ్జెట్ వివరాలను పరిశీలిస్తే  వార్షిక బడ్జెట్ మొత్తం రూ.3,24,234 కోట్లు కాగా అందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లని, మూలధన వ్యయం రూ.47,267 కోట్లని చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.2 శాతంగా ఉందన్నారు. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ అని భట్టి అన్నారు. శాఖల వారీగా నిధుల కేటాయింపు ఇలా ఉంది పశు సంవర్థక శాఖకు రూ.1,529 కోట్లు,విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు,
విద్యా శాఖకు రూ.26,674 కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు,కార్మిక శాఖకు రూ.998 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు .3,143 5,ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు,
ఎస్టీ సంక్షేమానికి రూ.7,937 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.3,769 కోట్లు,రాజీవ్ యువ వికాసానికి రూ.6 వేల కోట్లు,గృహ నిర్మాణ శాఖకు రూ.7,430,ఐటీ శాఖకు రూ.875 కోట్లు,
పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు,
చేనేత రంగానికి రూ.258 కోట్లు,పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33, 688 కోట్లు,
నీటిపారుదల శాఖకు రూ.22, 615 కోట్లు
ఆర్ అండ్ బీ శాఖకు రూ.12,789 కోట్లు,
న్యాయ శాఖకు రూ.2,367 కోట్లు,పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,907,హోం శాఖకు రూ.11,907 కోట్లు,గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ.500 కోట్లు. పర్యాటక శాఖకు రూ.1224 కోట్లు, వైద్యానికి రూ. 13670, వ్యవసాయం రంగానికి రూ.23179 కోట్లు కేటాయించిం చారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments