Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedరూ. 50.51 లక్షలకు అంగడి ఖరారు.

రూ. 50.51 లక్షలకు అంగడి ఖరారు.

📰 Generate e-Paper Clip

పోలీసుల జోక్యం సిండికేట్ విఫలం

రింగర్ల ఆశలు గల్లంతు

అయినా రూ.2.49 లక్షలు తగ్గిన ఆదాయం

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి అంగడి వేలం పాటను బుధవారం స్థానిక కమ్యూనిటీ హాలులో నిర్వహించగా రూ. 50.51 లక్షలకు సంత వేలం పాట ముగిసింది. అయితే సిండికేట్ అవ్వాలనుకున్న 36 మండి టెండర్ దారుల ఆశలు గల్లంతయ్యాయి. అంతే కాదు ఈ వారాంతపు సంతను స్థానికులకే రావాలని కలలు కన్న వారి ఆశలు కూడా అడియాశలు అయ్యాయి. ఇప్పటికీ నాలుగు సార్లు వాయిదా పడిన అంగడి వేలం ప్రక్రియ బుధవారం పోలీసుల రంగప్రవేశంతో ప్రశాంతంగా జరిగింది. టెండర్ ప్రక్రియ ప్రారంభం కాగానే స్థానిక ఎస్సై డి.నరేష్ అక్కడికి వచ్చి టెండర్లో పాల్గొన్న వారికి పలు సూచనలు చేసి, ఇది ప్రజా స్వామ్యం దేశంలో ఎవ్వరికైనా టెండర్ పాడే హక్కు ఉంటుంది.శాంతియుతంగా నిర్వహించుకోవాలని హెచ్చరిక చేసి వెళ్లారు. ఆ తర్వాత అధికారులు టెండర్ ప్రక్రియను కొనసాగించగా ఎట్టకేలకు రూ.50.51 లక్షలకు ఖరారు అయింది. నార్కెట్ పల్లికి చెందిన తెల్సూరి నరసింహులు అనే వ్యక్తి అత్యధికంగా రూ.50.51 లక్షలకు టెండర్లో పాల్గొని వేలం పాట పాడి టెండర్ దక్కించునున్నాడు.రెండో స్థానంలో రవీందర్ అనే వ్యక్తి రూ.50.50లక్షలకు వేలంపాట పాడి విరమించుకున్నాడు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీకి రావలసిన ఆదాయం గతంతో పోలిస్తే రూ.2. 42 లక్షలు తక్కువగా ఉన్నప్పటికీ, సిండికేట్ వ్యాపారులు ఊహించిన దానికి రూ.15 లక్షల పైగా వేలం పాటలో టెండర్దారులు పాల్గొనడం పంచాయతీ అధికారులకు ఊరటం ఇచ్చింది. ప్రభుత్వం గత ఏడాది ఈ అంగడి వేలం పాటను రూ. 52.93 లక్షలకు ఖరారు చేయగా, ఈసారి కొంత మేరకు తగ్గింది. అప్సెట్ ప్రైస్ రానందున జిల్లా కలెక్టర్, డిపిఓలు ఎట్టకేలకు తుది నిర్ణయాన్ని ఈ సాయంత్రానికి రూ.50.51 లక్ష లకు ఖరారు చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం ఉమారాణి, ఉపసర్పంచ్ ద్యావరి యాకయ్య,కార్యదర్శి బాల కిషన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments