Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedసబితను అడ్డుకున్న పోలీసులు

సబితను అడ్డుకున్న పోలీసులు

📰 Generate e-Paper Clip

బిఆర్ఎస్ శ్రేణుల ధర్నా

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: ఆత్మ హత్య చేసుకుని మరనించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు నర్సంపేటకు వెళ్తున్న బిఆర్ఎస్ నాయకురాలు, మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని,మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ లను రఘునాథపల్లి పోలీసులు కోమళ్ల టోల్గేట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం అడ్డుకున్నారు. అనంతరం
టోల్గేట్ నుండి వారిని రఘునాథపల్లి సీఐ కార్యాలయానికి తరలించారు. సమాచారం అందుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి,మాజీ ఎంపీ మాలోతు కవిత సహా జనగామ, రఘునాథపల్లికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు అక్కడకు తరలి వచ్చి సీఐ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా సబిత మాట్లాడుతూ పరామర్శించెందుకు వెళుతున్న వారిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్ లు తమకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments