Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedసీసీ టీవీలతో నేరాల నియంత్రణ

సీసీ టీవీలతో నేరాల నియంత్రణ

📰 Generate e-Paper Clip

వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్

సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: గ్రామాల్లో సీసీటీవీ లను ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరాల నియంత్రణకు దోహదం చేస్తాయని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ సూచించారు. ఆదివారం ఆయన జనగాం మండల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు,ఉపసర్పంచులతో జనగామ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా ప్రతినిధులకు సీసీటీవీలో ప్రయోజనాన్ని వివరించారు. ప్రతి గ్రామంలో సీసీ టీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సీసీటీవీ కెమెరాలతో గ్రామాల్లో భద్రత మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. అంతే కాకుండా నేరాల నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతాయని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను సులభంగా గుర్తించవచ్చని చెప్పారు. చోరీలు,వాహనాల తస్కరణ వంటి ఘటనలను అరికట్టడంలోను వాటి రేకవరీలోను సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ పండరి చేతన్,సీఐ సత్యనారాయణరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు,ఉపసర్పంచులు పాల్గొనగా త్వరలోనే అన్నీ గ్రామాల్లో సీసీటీవీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సర్పంచులు ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments