Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedజిల్లాలో తహసీల్దార్ల బదిలీలు

జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు

📰 Generate e-Paper Clip

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): జిల్లా వ్యాప్తంగా ఒకేసారి భారీగా 13 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. డి.స్వప్న కలెక్టర్ అఫిస్ నుండి స్టేషన్ ఘనపూర్ కు, డి.వెంకటేశ్వర్లు స్టేషన్ ఘనపూర్ నుండి కలెక్టర్ అఫిస్ సూపరిండెంట్ గా,పి. శ్రీనివాసరెడ్డి ఆర్డిఓ ఆఫీస్ నుండి జాఫర్ గడ్ కు ఏ.ఆండాలు కలెక్టర్ ఆఫీసు నుండి లింగాల ఘనపూర్ కు ,ఎన్.చంద్రశేఖర్ రెడ్డి కలెక్టర్ ఆఫీసు నుండి ఆర్డిఓ కార్యాలయానికి,
పి.రవీందర్ లింగాల గణపురం నుండి కలెక్టరేట్ ఎస్డిసి యూనిట్ -1కు, మోసిన్ జనగామ నుండి తరిగొప్పులకు, ఎం. మహిపాల్ రెడ్డి తరిగొప్పుల నుండి జనగామకు, బి.రాజేష్ జఫర్ గడ్ నుండి రఘునాథపల్లికి, పి.ఫణి కిషోర్ రఘునాథపల్లి నుండి కలెక్టర్ కార్యాల్యాయ సూపరిండెంట్ గా, సిహెచ్. రజిత ఎస్డిసి యూనిట్ -1 నుండి కలెక్టర్ ఆఫీస్ సూపరింటెండెంట్ గా,చంద్రమోహన్ కొడకండ్ల నుండి కలెక్టర్ ఆఫీస్ సూపరింటెండెంట్ గా,ఉత్తలూరి అనిల్ బాబు దేవరుప్పుల నుండి కొడకండ్ల కు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మొన్న 160 మంది పంచాయతీ కార్యదర్శులను, నేడు జిల్లా వ్యాప్తంగా అందరు తహసీల్దార్ లను బదిలీలు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో పూర్తి స్థాయిలో ప్రక్షాలన జరుగుతుందని చర్చ జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments