Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedనేషనల్ హైవే డ్రైనేజీ పైకప్పుల తొలగింపు 

నేషనల్ హైవే డ్రైనేజీ పైకప్పుల తొలగింపు 

📰 Generate e-Paper Clip

ప్రమాదకరంగా సిమెంటు బిల్లలు

పట్టించుకోని అధికారులు

రఘునాథపల్లి,(లీడ్స్ న్యూస్): రఘునాథపల్లి బస్టాండ్ సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్ద కంచనపల్లి రోడ్డు మూలమలుపు ఎల్లమ్మ గుడికి అనుకుని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డులో నిర్మించిన డ్రైనేజీ పైకప్పులను రాత్రికి రాత్రే తొలగించాలి. స్థానిక దుకాణాల పుణ్యమా అని ఆ డ్రైనేజీ పూర్తిగా కూడిపోయింది. దుకాణాల నుండి వచ్చే వ్యర్ధాలు అన్ని అందులో పడేస్తుండడంతో అది పూర్తిగా నిండిపోయింది కొద్దిపాటి వర్షం పడ్డా నీరంతా రోడ్లపై నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా తొలగించిన సిమెంటు బిల్లా రోడ్డుపై ప్రమాదకరంగా పడి ఉంది. దాన్ని పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. ఇప్పటికే రఘునాథపల్లి అండర్ బ్రిడ్జి వద్ద స్థానికులు నలుగురు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దీనిపై స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు దృష్టి సారించి, అనుమతి లేకుండా తొలగించిన వారిపై చర్యలు తీసుకుని, ప్రమాదాల జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments