Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedజిల్లాలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

జిల్లాలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

📰 Generate e-Paper Clip

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ఆస్పత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన నర్మెట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిసరాలను, వైద్యశాలలో గదులను, మందుల నిల్వలను పరిశీలించారు. అలాగే నిల్వ ఉన్న మందుల ఎక్స్పైరీ తేదీని పరిశీలించారు. సరిపడా మందులు ఉన్నాయా? ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యాక్సిన్ లను అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు . అనంతరం కెజిబివిని సందర్శించి స్టోర్ రూం సరకులను, మధ్యాహ్న భోజన వంటశాలను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాలు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు కాసేపు గణితశాస్త్రం పై తగు సూచనలు చేసి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments