
రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి సమీపంలోని ఓ వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను అధికారులు శుక్రవారం తెల్లవారుజామున రఘునాథపల్లి గ్రామ శివారులో పట్టుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు కంచనపల్లి గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ ను పిట్టల గుడిసెల వద్ద రఘునాథపల్లి జి పి ఓ శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అదే రాత్రి ఆ ట్రాక్టర్ ను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయమై స్థానిక రఘునాథపల్లి జిపిఓ శ్రీనివాస్,ఎస్సై నరేష్ లను సంప్రదించగా ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న మాట వాస్తవమేనని ధ్రువీకరించారు. అనుమతులు లేనందున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

