Friday, June 26, 2026
No menu items!
HomeUncategorizedరఘునాథపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

రఘునాథపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్దగిరి దర్గా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగ మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. టీజీ.24.బి.9237 నెంబరు గల ఎర్టిగా కారులో హైదరాబాద్ నుండి హనుమకొండ వైపు వెళ్తుండగా ఈ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడింది. ఆ సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఎండి. అసద్ (26), అప్సా హబీబ్ (27)లు ఘటన స్థలంలో అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవర్ రహముద్దిన్ ఖాన్, షాహిద్ బేగం, ఇలేష,రేష్మ లకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం  నిద్ర మత్తులో కారు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా వరంగల్ నయీమ్ నగర్ వాసులగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జనగామ చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కూడా ఇదే ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments