Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedస్థలం లేనివారికీ ఇందిరమ్మ మంజూరు

స్థలం లేనివారికీ ఇందిరమ్మ మంజూరు

📰 Generate e-Paper Clip

సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మంచి స్పందన వస్తోందని, ఇప్పటివరకు ఇళ్లకోసం దాదాపు 77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తొలి విడత ఎల్ – 1లో సొంత స్థలం ఉండి ఇళ్లు లేని 23 లక్షల మందిని ప్రభుత్వం ఎంపిక చేసి వారి కోసం రూ.6,500 కోట్లు కేటాయించిందని చెప్ప్పారు. ప్రస్తుతం రెండో విడత మంజూరు చేయనున్నట్లు అయన తెలిపారు. ఇకమీదట స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టించాలని భావిస్తుందన్నారు. కాగా, తొలి విడతలో పూర్తైన ఇళ్లు ఆమోదయోగ్యంగా ఉండటంతో, ప్రజల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మరింత ఆసక్తి పెరిగిందని సిఎం అన్నారు.

RELATED ARTICLES

Most Popular