Friday, June 26, 2026
No menu items!
HomeUncategorizedసర్కారు బడిని కాపాడుకుందాం

సర్కారు బడిని కాపాడుకుందాం

📰 Generate e-Paper Clip

సర్పంచ్ బైకాన్ రాజు

రఘునాథపల్లి లీడ్స్ న్యూస్ : గ్రామంలోని హైస్కూల్ను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులు అందరి పైన ఉందని కుర్చపల్లి గ్రామ సర్పంచ్ బైకాన్ రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రామంలో స్థానికులతో నిర్వహించిన సమావేశంలో రఅయన మాట్లాడుతూ స్థానికులు గ్రామ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు తమ వంతుగా బడిలో చేర్పించాలని సూచించారు. శుక్రవారం ఒక్కరోజే 20 మందిని తల్లిదండ్రులు పాఠశాలలో చేర్పించారు. ప్రతి ఒక్కరు పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ,గ్రామానికి చెందిన తోటకూర అనిల్, పులిగిల్ల రాజు,బాత్తుల శ్రీను. బాత్తుల ప్రవీణ్, కాసాని రవికుమార్, వల్లెపు కుమార్,బుర్ర ఎల్లగౌడ్, బత్తుల సదానందం, చాత్ర బోయిన నరేష్, తదితరులుపాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments