Sunday, October 25, 2026
No menu items!
HomeUncategorizedకెనాల్లో దూకి బాలుడు దుర్మరణం

కెనాల్లో దూకి బాలుడు దుర్మరణం

📰 Generate e-Paper Clip

లీడ్స్ న్యూస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం బాంజీపేట గ్రామంలో స్విమ్మింగ్ పూల్ అనుకొని  ఎండి. తాహిర్ (07) కెనాల్లో దూకి దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. జనగామకు చెందిన తాహిర్ పాఠశాలకు దసరా సెలవులు రావడంతో బాంజిపేట గ్రామమైన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. తన తాత గఫూర్ తో కెనాల్ చూపించాలని కోరగా ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై కెనాల్ వద్దకు వెళ్లారు. గఫూర్ వాహనాన్ని ఆపి పార్కింగ్ చేస్తుండగా వెంటనే తాహిర్ పరిగెత్తుకుంటూ వెళ్లి కెనాల్ లో దూకాడని, స్విమ్మింగ్ పూల్ గా భావించి దూకినట్లు గఫూర్ పోలీసులకు వివరించాడు. అయితే, ఆ వెంటనే గఫూర్ కూడా కెనాల్లో దూకి మనవడిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఫలితం లేకుండా పోయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాలించి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాత కళ్ళముందే మనవడు కెనాల్లో దూకి మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రఘునాథపల్లి  ఎస్సై ఎం. భరత్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular