కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్:
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నార్త్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత అయన పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలంచి నివాళులర్పించారు. విధుల్లో అమరులైన పోలీసులను స్మరించుకోవడం,వారి త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. అమరుల త్యాగాలను వృధా కానివ్వకుండా, వారి స్పూర్తితో మరింత బాధ్య తాయుతంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పోలీసులకు సూచించారు. ప్రస్తుత సమాజంలో మారుతున్న నేర స్వరూపానికి అనుగుణంగా పోలీసులు సైతం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అతి తక్కువ వ్యవధిలో ఎంతో చాకచక్యంగా నేరాలను ఛేదిన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసిపి అంబటి నర్సయ్య, రఘునాథపల్లి,జనగామ, స్టేషన్గన్పూర్,నర్మేట సిఐలు వేణు, సత్యనారాయణ రెడ్డి,శ్రీనివాస్,దేవేందర్, భరత్ సుమన్,స్థానిక ఎస్ఐ మోదుగు భరత్,వెస్ట్ జోన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొని పోలీస్ అమరులకు నివాళులర్పించారు.
