
జనగామ,లీడ్స్ న్యూస్ : చిన్నారి విద్యార్థులకు చిన్న జీయర్ స్వామి మంగళవారం జనగామలో ఆశీర్వచనం ఇచ్చారు. జనగామ పట్టణంలోని బీరప్పగడ్డ ప్రాంతంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ వి ద్యార్థులు బాణాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ చి న్న జీయర్ స్వామిని విద్యార్థులు దర్శించుకుని ఆశీస్సులు పొందారు. విద్యా ర్థులతో పాటు పాఠశాల కమిటీ ప్రతినిధులు,పాఠశాల ఆచార్యులను చిన్న జీ యర్ స్వామి ఆశీర్వదించారు. పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు బుస్సా సిద్ధేశ్వర్,కార్యదర్శి జైన రమేష్,గుణిగంటి రామక్రిష్ణ,ప్రధానాచా ర్యులు కొత్తపల్లి స్వప్న, ఆచార్యులు క్రిష్ణవేణి, అర్చన,శ్వేత, శిరీష, సంధ్య తదితరులు ఉన్నారు.
