
జనగామ, లీడ్స్ న్యూస్: జనగామ పట్టణం 3వ వార్డు బాలాజీనగర్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ గుడిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక మహిళలు రేణుక ఎల్లమ్మ తల్లికి గాజులు అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారిని గాజులతో అలంకరించి గాజుల పూజ,మంగళగౌరి పూజ,సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ పూజారి మారుపాక శాంప్రసాద్ అనంతరం మహిళా భక్తులకు పసుపు, కుంకుమ,బొట్టు, గాజులను పంపిణీ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దూడల శోభారాణి, మూడో వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి, మారుపాక విజయ,లగిశెట్టి పద్మావతి, దోసపాటి శ్రీలక్ష్మి, నారగోని శైలజలోనె మంజుల,తూముకుంట్ల విజయ, ఎనగందుల రేణుక,సునీత,పోగుల కవిత,రాంపల్లి మానస,మంగమమత,గొరిగె సత్తెమ్మ,శోభన,ఆలేటి పద్మ,కొలుపుల పార్వతి,వేమల్ల హరిష, సృజన,అయిత రమ,భార్గవి,చింత లక్ష్మి,స్వాతి భోగ రజిని,బండోజు సరళ,అంజలి,వాణి,వీణ, పావని,సువర్ణ,గట్టు విజయ,నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

