ఖర్గేతో భేటీ అనంతరం కొండా సురేఖ ఫైర్
లీడ్స్,హైదరాబాద్:
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆమె, తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందే సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. తన కూతురు మాట్లాడిన దానికి తనపై చర్యలు తీసుకోవద్దని సురేఖ స్పష్టం చేశారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని రాహుల్ గాంధీ చెబుతుంటారని గుర్తు చేస్తూ, తన కూతురిని రెచ్చగొట్టినందుకే ఆమె విమర్శలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ‘పార్టీలో బీసీలకు ఒక న్యాయం. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా?’ అని సురేఖ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. నా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, నా మీద ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తెలుసు, అధిష్టానం వాళ్ల గురించి కూడా ఆలోచించాలి అని ఆమె అన్నారు.
మీనాక్షి నటరాజ్ కు నేను చెప్పాల్సింది అంతా చెప్పను, నా కూతురికి పెళ్లైంది, తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది, తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు. ఆమె మాటలని సమర్ధించను లేను, తన జీవితం తన ఇష్టం అని ఆమె అన్నారు. నేను బీసీ మహిళా మంత్రిని, నా భర్త మున్నూరు కాపు,నేను పద్మశాలి కులం
మా కులం ఓట్లు 16 శాతం ఉన్నాయి.
నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నా శాఖను నిర్వహిస్తున్నానని ఆమె చెప్పారు. ఒకపక్క కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదు అని గొడవ నడుస్తుందని గుర్తు చేశారు.

