Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedఆరు బిల్లులకు కేబినెట్ ఆమోదం

ఆరు బిల్లులకు కేబినెట్ ఆమోదం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,లీఫ్స్ న్యూస్ :

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 7 కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వాటిలో ముఖ్యమైనవి తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగుల జీతాల నుంచి 10-15 శాతం కట్ చేసి పేరెంట్స్ ఖాతాల్లో జమచేసే బిల్లు, విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లు,గిగ్ వర్కర్ల బిల్లు,అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుతో పాటు పలు బిల్లులను ఆమోదించింది. వీటన్నింటికి గవర్నర్ ఆమోదం లభిస్తే అవి చట్టంగా మారనున్నాయి. నిత్యం అనేక ప్రాంతాల్లో వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లలు పట్టించుకోవడం లేదని పోలీసులను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లు పై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments