Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedకాంగ్రెస్లో కొండా చిచ్చు

కాంగ్రెస్లో కొండా చిచ్చు

📰 Generate e-Paper Clip

మంత్రి సురేఖకు వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్

లీడ్స్,హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ నిర్వహించి కొండా సుస్మిత,సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వీరిలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, వేముల వీరేశం సహా మరికొందరు ఉన్నారు. సురేఖ కూతురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని,అవి పూర్తిగా సుస్మిత వ్యక్తిగతమని సురేఖ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాధ్యతగల రాష్ట్ర క్యాబినెట్లో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వారు మండిపడ్డారు. తక్షణమే సురేఖను మంత్రివర్గంలో నుండి భర్త చేయాలని కోరారు. ముఖ్యమంత్రిపై సుస్మిత ఘాటుగా విమర్శలు చేయడం, సురేఖ తనకు సంబంధం లేదని చెప్పడం, ముఖ్యమంత్రి మద్దతుగా 18 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు సమావేశం నిర్వహించడం కాంగ్రెస్ పార్టీలో పెనుచిచ్చుగా మారింది. ఈ పరిణామం ఎటువైపు దారి తీస్తుందోనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,కేఆర్ నాగరాజు,మధుసూదన్ రెడ్డి,
రేవూరి ప్రకాష్ రెడ్డి,దొంతి మాధవరెడ్డి, మందుల సామెల్,వెడ్మ బొజ్జు,వేముల వీరేశం,బుయ్యని మనోహర్ రెడ్డి,కూచుకుళ్ల రాజేష్ రెడ్డి,బత్తుల లక్ష్మా రెడ్డి,బాలు నాయక్,వీర్లపల్లి శంకర్,కుంభం అనిల్ కుమార్ రెడ్డి,చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య,బల్మూరి వెంకట్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular