పూర్తయిన ప్రమాణస్వీకారం
తొలిదశలో 9 మంది మంత్రులుగా ప్రమాణం

హైదరాబాద్ బ్యూరో,లీడ్స్ న్యూస్: తమిళనాడు ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ జోసఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత టీవీకే పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఒక మహిళలకు కూడా చోటు కల్పించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఎన్. ఆనంద్,ఆదవ్ అర్జున్, కేజీ అరుణ్ రాజ్,
కే.ఏ.సెంగోట్టయ్యన్, పి.వెంకట్రామన్,
ఆర్.నిర్మల్ కుమార్,రాజ్ మోహన్, డాక్టర్ టి.కే ప్రభు,ఎస్.కీర్తన తదితరులు ఉన్నారు. రేపు తమిళనాడు ఎన్నికల్లో గెలుపొందిన 234 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది.
ముఖ్యమంత్రి విజయ్ నేపథ్యం:
ఈయన 22,జూన్ 1974లో తమిళనాడులో జన్మించారు.తల్లిదండ్రులు శోభ, చంద్రశేఖర్ లు,శోభ హిందూ మతస్తురాలు కాగా,చంద్రశేఖర్ క్రిస్టియన్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చంద్రశేఖర్ సినీ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. విజయ్ వివాహం 1999లో సంగీతతో జరిగింది.
మీరికి ఒక కుమారుడు,కూతురు ఉన్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య కాస్త డిస్టర్బెన్స్ జరిగిన సంఘటన తెలిసిందే. ఇప్పటి వరకు 65 సినిమాల్లో నటించాడు విజయ్. ప్రస్తుతం ‘జననాయక’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొన్ని అడ్డంకుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 1992లో ఈయన తొలి సినిమా విడుదల అయింది. కేరళ, తమిళనాడులో విజయ్ కి గట్టి ఫాన్స్ అసోసియేషన్స్ లు ఉన్నాయి.
