నేడు ప్రమాణ స్వీకారం
హాజరుకానున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: ఎట్టకేలకు తమిళనాడులో సినీ హీరో,టీవీకే అధినేత సి.జోసెఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు స్థిరపడింది. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటును ఆహ్వానిస్తూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ ఆయనను ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఆదివారం తమిళనాడు సీఎంగా విజయ్ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం10 గంటలకు
చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో అయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. బల నిరూపణ కోసం మూడు రోజుల గడువును టీవీకేకు గవర్నర్ అవకాశం కల్పించారు. టీవీకేకు కాంగ్రెస్,సిపిఐ,సిపిఎం విసికే,ఐయూయంల్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. పార్టీల వారీగా ఎమ్మెల్యేల సంఖ్య ఇలా ఉంది. విజయ్ శ్రీ పెరంబుర్, తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేసిగెలిచాడు. వాటితో కలుపుకుంటే 108 స్థానాలు టీవీకే కైవసం చేసుకుంది. తిరుచ్చి స్థానానికి విజయ్ రాజీనామా చేయనున్నందున టీవీకేకు -107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అలాగే మిత్రపక్షాలైన కాంగ్రెస్- 5, సిపిఐ -2, సిపిఎం -2, వీసికే -2, ఐయూయంల్ -2
ఐదు పార్టీలు కలిపి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యేల సంఖ్య 120కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల బలం కావా ల్సి ఉండగా ఆ ఫిగర్ దాటి మరో రెండు స్థానాలు అధికంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే పలువురు సినీ తారలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మొత్తం మీద పార్టీ స్థాపించి 24 నెలల్లోనే సీఎంగా పదవి ప్రమాణం చేసి తనదైన రికార్డు సొంతం చేసుకోనున్నారు.
