Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedనిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేస్తా

నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేస్తా

📰 Generate e-Paper Clip

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: ఆ దేవుడు నాకు ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించాడు ఊపిరి ఉన్నంతవరకు ప్రజాసేవలో జీవితం గడుపుతారని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. గురువారం రఘునాథపల్లిలో ఆయన 57వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సభ్యునిగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆశీస్సులతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న తాను సాధ్యమైనంతవరకు శక్తి వంచన లేకుండా ప్రజా సంక్షేమానికి పాటుపడతానని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను గజమాల, పూలమాలలు,బొకేలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లీడ్స్ న్యూస్ డైరెక్టర్ కొలుపుల రవి, పాత్రికేయులు ఆకుల మహేష్,సుంకరి శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ గొరిగి రవి, రఘునాథపల్లి ఉపసర్పంచ్ దావరి యాకయ్య,పార్టీ ప్రతినిధులు కోళ్ల రవి, నామాల బుచ్చయ్య,పేర్న రవి,వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు,పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular