Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

157 ద‌ర‌ఖాస్తులు స్వీకరణ

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ప్రజల నుండి ప్రజావాణిలో వచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాల‌ని జనగామ జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో అదనపు కలెక్టర్ బెన్షాలోంతో కలిసి కలెక్టర్ కలెక్టర్ 157 అర్జీల‌ను స్వీక‌రించారు. వచ్చిన ప్రతి ద‌ర‌ఖాస్తును నిషితంగ పరిశీలించి సంబంధిత శాఖ‌ల అధికారులకు అంద‌జేశారు. ఈ ఆర్జీల‌కు అత్యంత ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల‌ని, స‌మ‌స్య‌ల‌ పరిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. ఈ ప్ర‌జావాణిలో వచ్చిన దరఖాస్తులలో మెజారిటీగా ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు ఇప్పించాలని ఉన్నాయి.అలాగే రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండా గ్రామ సర్పంచ్ కుర్ర స్వరూప రాజేందర్ దంపతులు గ్రామపంచాయతీ భవనం కోసం నిధులు మంజూరు చేయాలని దరఖాస్తు చేయగా, కోమల గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు బొల్లపల్లి కృష్ణ గ్రామంలో తమకు క్వారీ మంజూరు అయిందని దాన్ని స్థానికులు అడ్డుకుంటున్నారని, ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఓలు గోపీరాం,డి.య‌స్‌. వెంకన్న,డీఆర్‌డీఓ వసంత,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మ‌ల్జిఖార్జున్ రావు,వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు,త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments