Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedహెచ్.పి.వి టీకాతో క్యాన్సర్ కు అడ్డుకట్ట

హెచ్.పి.వి టీకాతో క్యాన్సర్ కు అడ్డుకట్ట

📰 Generate e-Paper Clip

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ ప్రతినిధి, (లీడ్స్ న్యూస్): హ్యూమన్ పాపిలోమా వైరస్ నివారంకు హెచ్.పీ.వి టీకా ఎంతో గాను దోహదం చేస్తుందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం  పట్టణంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రంలో బాలికలకు టీకా వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా బాలికలను సర్వికల్ క్యాన్సర్ నుండి రక్షించడంలో ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. తల్లిదండ్రులు సహకరించి బాలికలు తప్పనిసరిగా ఈ టీకా తీసుకునేలా చూడాలని సూచించారు. ఈ టీకా కార్యక్రమాన్ని జిల్లా ఆరోగ్య శాఖ విస్తృతంగా అమలు చేయాలనీ వైద్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. కె. మల్లిఖార్జున రావు, చైల్డ్ హెల్త్ & ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.అశోక్ కుమార్,డాక్టర్ శ్యాం కుమార్, డా. కమల్ హాసన్, డా.కనక రాజు,శిశు వైద్య నిపుణుడు, డా.అనురాధ,వార్డు కౌన్సిలర్ సువర్ణ,డా. రేవతి, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments