Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorizedబండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు

📰 Generate e-Paper Clip

ఫిర్యాదులపై మరో కేసు

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరధ పై హైదరాబాదులోని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేస్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. రేపు హైదరాబాదులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ జరగనున్నడగా ఇప్పుడు తెలంగాణలో ఈ టాపిక్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బండి సాయి భగీరథ 17 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం జరిపాడని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు సాయి భగీరథ పై బి.ఎన్.ఎస్ సెక్షన్ 74, 75 సహా పోక్సో కేసు లోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద కేసు నమోదు చేశారు. సదరు మైనర్ బాలిక ఇప్పటికే సాయి భగీరథ వేధింపులు భరించలేక రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తమను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ బండి సాయి భగీరథ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబ సభ్యులపై  ప్రతి ఫిర్యాదు చేశారు. దీంతో అటు బండి సాయి భగీరథ, ఇటు మైనర్ బాలికలపై రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ టాపిక్ రాజకీయ వర్గాల్లో  పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. బిఆర్ఎస్ నాయకురాలు మాజీ మంత్రి సబితా,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు ఈ విషయమై బిఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మంత్రి బండి సంజయ్ కుమారుడిని రక్షించేందుకు పోలీస్ స్టేషన్లో బెయిల్ వచ్చే విధంగా కేసులు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారని,ఇది సరైంది కాదని, పోలీసు వ్యవస్థపై మండిపడుతున్నారు. బండి సంజయ్ ఈ కేసును తప్పుదో పట్టించే విధంగా చూస్తున్నాడని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే బండి సంజయ్ పిఆర్ఓ,మాజీ v6 పాత్రికేయుడు ఒకరు ఈ కేసును రాజీపరిచేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిందితులను శిక్షించకుండా కేసును రాజీపరిచేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అంటూ బిఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments