Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedమన దినచర్యలో మార్పు అవసరం

మన దినచర్యలో మార్పు అవసరం

📰 Generate e-Paper Clip

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత

వరంగల్,లీడ్స్ న్యూస్:
సమాజం బాగుండాలంటే మనం బాగుండాలి, మనం బాగుండాలంటే దిన చర్యలో మార్పు అవసరమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎస్. శ్వేత అన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం కమిషనరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన వారాంతపు పరేడ్‌ను ఆమె పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, క్రమశిక్షణ,నిబద్ధత,శారీరక దృఢత్వంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు. పోలీస్ లు తమ ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి వ్యాయామం, యోగాను అలవాటు చేసుకోవాలని తెలిపారు. “పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి సేవలు అందించగలుగుతారు” అంతేకాకుండా, క్రమశిక్షణే పోలీసు వ్యవస్థకు పునాది అని పేర్కొంటూ,ప్రతి ఒక్కరూ విధుల్లో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీ లు అంతయ్య, సత్యనారాయణ,ఆర్.ఐ లు స్పర్జన్ రాజ్,సతీష్, శ్రీధర్,చంద్రశేఖర్, ఉదయ్ భాస్కర్,ఇన్స్ స్పెక్టర్లు వెంకన్న, సువర్ణ,సుజాత,ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular