Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedరక్తదానంతో మానవత్వాన్ని చాటుదాం

రక్తదానంతో మానవత్వాన్ని చాటుదాం

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ లీడ్స్: రక్తదానం చేసి మానవత్వాన్ని చాటలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్ ఆధ్వర్యంలో మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సహకారంతో చంపక్ హిల్స్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం అత్యంత మహత్తరమైన సేవ అని,అవసరమైన వారికి సమయానికి రక్తం అందించడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో వైద్య విద్యార్థులు,సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు,జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం,జీఎంసీ ప్రిన్సిపల్ డా.నాగమణి, ఆర్ఎంఓ డా.కోటాచలం, వైద్యులు,విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మాత శిశు ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులు రోగులకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య సేవలపై రోగులతో మాట్లాడారు.

మాత శిశు ఆస్పత్రిలో మహిళతో మాట్లాడుతున్న కలెక్టర్
RELATED ARTICLES

Most Popular