Wednesday, October 28, 2026
No menu items!
HomeUncategorizedరఘునాథపల్లిలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ

రఘునాథపల్లిలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి, లీడ్స్ న్యూస్: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చంద్ర రెడ్డిలు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన వెల్ది క్రాస్ రోడ్ సమీపంలోని కురుమ భవన్ నుండి బస్టాండ్ సమీపంలోని ఇందిర గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు బందు,కొత్త రేషన్ కార్డల పంపిణి,
సన్న బియ్యం,ఉచిత విద్యుత్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందని వారు తెలిపారు. పార్టీ నాయకులు నామాల బుచ్చయ్య,సింగిరెడ్డి శ్రీనివాస్ లోనే శ్రవణ్,మండల,గ్రామ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు,సర్పంచులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular